Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *వేంకటాద్రి గారికి నివాళులు అర్పించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ మరియు కొట్టం శిరీష రెడ్డి* ది:- 14/02/2026 శనివారం ఎదులాపురం మున్సిపాలిటీ, వరంగల్ క్రాస్ రోడ్ పరిధిలోని 30 వ వార్డు మదర్ థెరిసా కాలనీ కి చెందిన ఆశా వర్కర్ అన్నామణి గారి తండ్రి వేంకటాద్రి గారు అనారోగ్య సమస్యల కారణంగా ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా.సురేష్ నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కొట్టం శిరీష రెడ్డి వారి స్వగృహం నందు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నిరుపేద కుటుంబం కావడంతో దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం శిరీష రెడ్డి గారు తన సొంత నిధులు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి అలాగే వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతునికి ప్రార్థించారు.అలాగే వారి కుటుంబాన్నీ ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఎల్ల వేళల అండగా ఉంటుందని భరోసా ఇచ్చి మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భంగా వారితో పాటు పాలేరు నియోజకవర్గ ఆత్మా కమిటీ డైరెక్టర్ ఎన్. పి. చారీ,ఎదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు కళ్లెం.శేష్ రెడ్డి, ఇమ్మాన్యేలు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Mana Mahati News