Sunday, 26 July 2026 03:29:49 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

Date : 28 December 2025 07:43 PM Views : 239

Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ సంగారెడ్డి, డిసెంబర్ 28, నివాస్ న్యూస్: సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిర్మలాజగ్గారెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. దేశ నిర్మాణంలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు తమ ఆస్తులు, ప్రాణాలను కూడా లెక్కచేయకుండా త్యాగాలు చేశారని గుర్తు చేశారు. 140 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వేదికల ద్వారా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకుల ఫోటోలను మార్ఫింగ్ చేసి యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. యువత ఈ కుట్రలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, సిడిసి సభ్యులు రామ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సదాశివపేట మండల అధ్యక్షులు సిద్ధన్న, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు జార్జ్, బుచ్చి రాములు, నర్సింహారెడ్డి, నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్, శ్రీకాంత్ గౌడ్, బల్వంత్ రెడ్డి, అనిల్, చారి తదితరులు పాల్గొన్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :