Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *నటి రాశికి అనసూయ క్షమాపణలు* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 5 గతంలో ఓ టీవీ షోలో నటి రాశిపై చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలకు.. యాంకర్ అనసూయ భరద్వాజ్ తాజాగా క్షమాపణలు చెప్పింది. ఆ స్కిట్లో వచ్చిన డైలాగులను అప్పట్లో ప్రశ్నించలేకపోయానని అంగీకరించింది. అది తన తప్పేనని, కాలక్రమేణా తాను మారానని వివరణ ఇచ్చింది. మహిళల గౌరవం, భద్రత కోసం నిలబడటం నేర్చుకున్నానని ఎస్ ఎం లో పేర్కొంది. మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది.
Admin
Mana Mahati News