Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : ఘంటారావం పత్రికకు అఖిల భారతీయ జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ సంఘీభావ ప్రకటన నిజానికి నిలిచిన కలానికి సంపూర్ణ మద్దతు చుంచు కుమార్ అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ చైర్మన్ హైదరాబాద్ ప్రతినిధి నివాస్ న్యూస్ జనవరి 13: సమాజంలో నిజాన్ని నిర్భయంగా నికార్సుగా ప్రజలకు తెలియజేయడమే అసలైన జర్నలిజమని మరోసారి నిరూపించిన ఘంటారావం పత్రికకు అఖిల భారతీయ జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల తరఫున నిలబడి అక్రమాలు అన్యాయాలను ప్రశ్నిస్తూ నిజాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న పత్రికలే ప్రజాస్వామ్యానికి నిజమైన రక్షకులని పేర్కొన్నారు.
సమాజంలో నిత్యం జర్నలిస్టులపై బూతుపురాణాలు భౌతిక దాడులు తప్పుడు కేసులు బెదిరింపులు జరుగుతున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎన్ని నోటీసులు వచ్చినా హెచ్చరికలు ఇచ్చినా తమ దారి మార్చకుండా లాలూచీకి లొంగకుండా నిజాన్ని నిజంగానే చెప్పిన తీరుకు ఘంటారావం పత్రిక జర్నలిజానికి అద్దం పట్టిందని అఖిల భారతీయ జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ చైర్మన్ చుంచు కుమార్ ప్రశంసించారు. నిజాన్ని రాయడం అంటే సౌకర్యాన్ని కోల్పోవడం భయాన్ని ఎదుర్కోవడం ఒంటరిగా నిలబడటం అయినప్పటికీ ప్రజల తరఫున నిలబడి నిజాన్ని వెలుగులోకి తీసుకురావడమే జర్నలిజం యొక్క అసలైన ధర్మమని ఆయన పేర్కొన్నారు. నిజం పలికినవాడు నిందలు భరించాల్సి వస్తుందని వేమన చెప్పిన మాటలు నేటి జర్నలిజానికి కూడా అచ్చంగా సరిపోతాయని అన్నారు. అదే నిజం సమాజాన్ని మేల్కొలిపి ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువుగా మారుతుందని స్పష్టం చేశారు.
భయపడే వాడికి కలం అవసరం లేదని ప్రశ్నించే వాడికే కలం ఆయుధమని కాళోజీ చెప్పిన భావనను గుర్తు చేస్తూ ప్రజల కోసం నిలబడ్డ ప్రతి పత్రికకు ప్రతి జర్నలిస్టుకు అఖిల భారతీయ జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. నోటీసులతో జర్నలిజాన్ని ఆపలేరని బెదిరింపులతో నిజాన్ని చంపలేరని లాలూచీలతో కలాన్ని కొనలేరని ఆయన స్పష్టం చేశారు. నిజానికి నిలిచిన ప్రతి జర్నలిస్టు ప్రజాస్వామ్యానికి రక్షకుడేనని ఈ సంఘీభావ ప్రకటన స్పష్టంగా చాటుతోందని తెలిపారు. నిజం మాట్లాడే కలం బతకాలనీ ప్రశ్నించే స్వరం వినిపించాలనీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే నిజమైన జర్నలిజం నిలబడాల్సిందేనని పేర్కొన్నారు. అఖిల భారతీయ ఎలక్ట్రానిక్ జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఘంటారావం పత్రికకు ఈ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని నాయకులు తెలిపారు. సమాజ హితం కోసం అక్రమాలు అన్యాయాలు జర్నలిస్టులపై జరిగే దాడులను ఖండిస్తూ నిలబడే ఏ న్యూస్ పత్రికకైనా అఖిల భారతీయ జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ పూర్తి సంఘీభావం ఉంటుందని వారు స్పష్టం చేశారు.
Admin
Mana Mahati News