Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలంతో పాటు గృహాలు మంజూరు చేయాలి తెలంగాణ మాల జర్నలిస్టుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేతమల్ల సహాదేవ్ డిమాండ్ కురవి జనవరి18( నివాస్ న్యూస్): జిల్లాలో పని చేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ గృహాలు ఇవ్వాలని తెలంగాణ మాల జర్నలిస్టుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేతమల్ల సహాదేవ్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో గత కొన్నేళ్లుగా వివిధ పత్రికలు, చానళ్లలో రిపోర్టర్లుగా ఉన్నవారు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తున్నారని తెలిపారు. వీరిలో చాలా మందివి పేద కుటుంబాలేనని, సొంత ఇల్లు లేక అద్దెకు ఉంటూ దుర్భరజీవితం గడుపుతూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, నివేశన స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీ మేరకు జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి, వెంటనే నివేశన స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డోర్నకల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలుస్తే కురవి మండలంలో పనిచేస్తున్న కొందరికి కాకుండా జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలంతో పాటు ఇందిరమ్మ గృహాలు ఇస్తానని శ్రీ వీరభద్ర స్వామి సాక్షిగా ప్రస్తుత ఎమ్మెల్యే రామచంద్రనాయక్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా హామీ అమలు చేయాలని సహాదేవ్ కోరారు. లేదంటే జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Admin
Mana Mahati News