Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా. తెలంగాణ వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలకు సాధారణ ఎన్నికలు-2026 లో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఆలియాబాదు, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారి , అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు మురళీ, వేణుల చే మొదటి స్థాయి శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరం లో నిర్వహించినారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎన్నికలకు ఉపయోగించే సామాగ్రి సేకరణ, ఎన్నికలు జరిగే సమయంలో, ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ అప్పగించే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి, ప్రతి పోలింగ్ స్టేషన్ లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు ఖచ్చితంగా చూసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమని పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటుహక్కును వినియోగించుకోవాలని ఫోరం-12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఏర్పాటుచేశామని ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ నిర్వహణ నోడల్ అదికారి విజయ్ కుమారి, బ్యాలెట్ బాక్స్ నిర్వహణ నోడల్ అదికారి సాంబశివ రావు , పోస్టల్ బ్యాలెట్ పేపర్ నోడల్ అదికారి ఝాన్సీ రాణి పాల్గొన్నారు.
Admin
Mana Mahati News