Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *ఫోన్లు దొంగిలిస్తున్నాడని.. 12 ఏళ్ల కొడుకును గొలుసులతో బంధించి..!* ప్రవర్తన సరిగాలేని తమ కొడుకు విషయంలో ఆ తల్లిదండ్రులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అతడి ప్రవర్తనతో ఇతరులకు ఇబ్బంది కలగకూడదని తమ 12ఏళ్ల కొడుకుని గొలుసులతో కట్టేసి రెండు నెలలపాటు ఇంట్లో బంధించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని ఓ ఇంట్లో రెండు నెలలుగా బాలుడిని అతడి తల్లిదండ్రులు గొలుసులతో బంధించినట్లు ఇటీవల చైల్డ్‌హెల్ప్ లైన్ నంబర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న శిశు సంక్షేమ కేంద్ర అధికారులు ఆ బాలుడికి గొలుసుల నుంచి విడిపించి సంక్షేమ కేంద్రానికి తరలించారు. అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.
Admin
Mana Mahati News