Sunday, 26 July 2026 04:35:35 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

*బ్రేకింగ్ న్యూస్*బయటపడిన మరో రూ.2 వేల కోట్ల భూ కబ్జా స్కామ్!*

Date : 08 January 2026 12:03 PM Views : 485

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *బ్రేకింగ్ న్యూస్*బయటపడిన మరో రూ.2 వేల కోట్ల భూ కబ్జా స్కామ్!* రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మక్తా మహబూబపేటలో భారీ భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సర్వే నంబర్‌ 44లో ఉన్న 43 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఓ భూకబ్జా ముఠా కన్నేసింది. 58 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ప్రభుత్వ భూమిని కాజేయడానికి యత్నించినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ కబ్జాకు సబ్ రిజిస్టర్ సహకరించినట్లు విచారణలో తేలింది. నకిలీ పత్రాలతో భూమిని అక్రమంగా రిజిస్టర్ చేయడంలో సహకరించినందుకు, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో జాయింట్ సబ్ రిజిస్టర్–2గా పనిచేస్తున్న కె. మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మరోసారి అక్రమాల గుట్టు రట్టయ్యింది.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: