Sunday, 26 July 2026 04:30:32 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

తాళ్లపల్లి రమేష్ గౌడ్‌కు ఏఐజెపిఎఫ్ కీలక బాధ్యత

ఏఐజెపిఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం

Date : 19 January 2026 01:56 PM Views : 237

Mana Mahati News - తెలంగాణ / వరంగల్ : ఏఐజెపిఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాళ్లపల్లి రమేష్ గౌడ్ నియామకం మంచిర్యాల ప్రతినిధి నివాస్ న్యూస్ జనవరి 19: ################################################### అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏఐజెపిఎఫ్) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ తాళ్లపల్లి రమేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

గత కొన్నేళ్లుగా జర్నలిజం రంగంలో తాళ్లపల్లి రమేష్ గౌడ్ అందిస్తున్న సేవలు, జర్నలిస్టుల సమస్యలపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన, నిబద్ధతను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు రాష్ట్ర కమిటీ తెలిపింది. ముఖ్యంగా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వారి భద్రత, సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఈ నియామకానికి ప్రధాన కారణంగా నిలిచిందని పేర్కొంది. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల రక్షణ కోసం, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు, అలాగే జర్నలిస్టులకు అండగా నిలిచేలా అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను మరింత బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనపై పెట్టిన బాధ్యతను నిజాయితీగా, నిబద్ధతతో నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు.

తన నియామకానికి సహకరించిన జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా మీడియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అకాడమీ చైర్మన్ ఇసంపెల్లి వేణు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బింగి సుధాకర్, అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర చైర్మన్ చుంచు కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పర్కాల సమ్మయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జైపాల్ సింగ్‌తో పాటు తోటి జర్నలిస్టు మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. తాళ్లపల్లి రమేష్ గౌడ్ నియామకం పట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జర్నలిస్టుల సమస్యలకు మరింత బలమైన పరిష్కారం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Nivas

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :