Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *ఔషధ తనిఖీ అధికారికి అభినందన కార్యక్రమం* మన మహతి న్యూస్ ప్రతినిధి(బి.వి.ఎస్.ఎన్.మూర్తి) పాల్వంచ: పాల్వంచ యూనిట్ కెమిస్ట్ సోదరీ సోదరులకు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఔషధ తనిఖీ అధికారి శ్రీమతి జి .అశ్విని ఉత్తమ ఔషధ తనిఖీ అధికారిగా మన డైరెక్టర్ గారి చేతుల మీదుగా షీల్డ్ మరియు ప్రశంసా పత్రం అందుకున్న సందర్భంగా ఈరోజు అనగా మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ నందు గల మన ఔషధ తనిఖీ కార్యాలయం నందు మేడం గారికి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం ఉన్నందున సభ్యులందరూ సకాలంలో హాజరై జయప్రదం చేయవలసిందిగా పాల్వంచ పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి ఆరుట్ల లక్ష్మణ్ కోరారు.
*ఔషధ తనిఖీ అధికారికి అభినందన కార్యక్రమం*
Admin
Mana Mahati News