Mana Mahati News - ఆంధ్రప్రదేశ్ / Mana mahati news : *ప్రేమ పెళ్లి చేసుకుందని.. బతికుండగానే కన్నబిడ్డకు కర్మక్రియలు* తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్నబిడ్డకు బతికుండగానే కర్మక్రియలు చేసిన ఘటన చిత్తూరు జిల్లా పిళ్లారికుప్పంలో చోటుచేసుకుంది. హేమప్రియ అనే యువతి తల్లిదండ్రుల మాట వినకుండా అదే గ్రామానికి చెందిన కిశోర్ను ప్రేమించి వివాహం చేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె తల్లిదండ్రులు, కుమార్తె మృతి చెందినట్టుగా భావిస్తూ ఆమె ఫోటోకు నివాళులు అర్పించి కర్మక్రియలు నిర్వహించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.
Admin
Mana Mahati News